ప్రియాంక చోప్రా ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆమె ఏం చెప్పినా అది వైరల్ అవుతుంది. యంగ్‌స్టర్స్ అదే పనిగా ఆమె మాటలను వైరల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్పిరేషనల్ కోట్స్ లో ప్రియాంక చెప్పిన మాటలు నిరవధికంగా వస్తూనే ఉంటాయి. అన్ని రీల్స్ ఉన్నాయి పీసీ పేరు మీద. ప్రస్తుతం ఆమె సిటాడెల్ ప్రమోషన్లలో ఉన్నారు.
ఈ సందర్భంగా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా ముందు ఓ విలేఖరి నెక్స్ట్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు? అనే ప్రశ్నను ఉంచారు. ఏమాత్రం తడుముకోకుండా ఆలియా పేరు చెప్పేశారు ప్రియాంక చోప్రా. ఆలియాభట్ పేరు చెప్పిన కాసేపటికి ఆమె ఆలయా పేరును ప్రస్తావించారు. అదేంటి? ఇప్పుడే ఆలియా పేరు చెప్పారు కదా అని ఎదురుప్రశ్న వినిపించింది. దానికి పీసీ డీటైల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ``ఆలియా ఆల్రెడీ సూపర్‌స్టార్. మీరు నెక్స్ట్ సూపర్‌స్టార్ ఎవరు అని అడిగారు. అందుకే పేరు మార్చి చెప్పాను. పూజా బేడీ కుమార్తె ఆలయా. ఆమె ఆలోచనా విధానం, ప్రవర్తన వైవిధ్యంగా అనిపించాయి.
దేనికీ పెద్దగా రియాక్ట్ అవ్వని మనస్తత్వం ఆమెది. తప్పకుండా అనుకున్న హైట్స్ రీచ్ అవుతుంది. తనదైన పద్ధతిలో దూసుకుపోవడానికి రెడీ అవుతోంది`` అని అన్నారు. పీసీ చేసిన సినిమాల్లో అత్యంత క్లిష్టమైన పాత్ర గురించి మాట్లాడుతూ బర్ఫీలోని జిల్‌మిల్ కేరక్టర్ చేయడం కష్టమని అన్నారు. సినిమాగా చూస్తున్నంతసేపు సరదాగా, ఆనందంగా అనిపిస్తుంది. సంగీతం సూపర్‌గా ఉంటుంది. అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాను. నేను నా సినిమాలను ఎప్పుడూ చూసుకోను. కానీ ఆ సినిమాకు పడ్డ గుర్తుకొచ్చి రెండు, మూడు సార్లు చూసుకున్నాను అని అన్నారు ప్రియాంక. ప్రియాంక ప్రస్తుతం ప్రచారం చేస్తున్న సిటాడెల్ ఏప్రిల్ 28న ఓటీటీలో విడుదల కానుంది.ఇది హాలీవుడ్ సీరీస్. ఈ సీరీస్ ఇండియన్ వెర్షన్‌లో నటిస్తున్నారు సమంత రూత్ ప్రభు. ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్ కీ రోల్ చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ స్పై డ్రామా ఇది.